కౌటాల పీహెచ్సీలో ఆధునిక సదుపాయాల ఏర్పాటుకు కృషి

66చూసినవారు
కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆధునిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. శుక్రవారం కౌటాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈరోజు నార్మల్ డెలివరీ ద్వారా పుట్టిన నవజాత శిశువును పరీక్షించడం జరిగింది. అనంతరం వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి, ఆస్పత్రిలో కావలసిన సదుపాయాల గురించి చర్చించడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్