గ్లైసిల్ పత్తి విత్తనాలు పట్టివేత

60చూసినవారు
గ్లైసిల్ పత్తి విత్తనాలు పట్టివేత
దహెగాం మండలం హత్తిని గ్రామంలో 124 కిలోల నకిలి పత్తి విత్తనాలు పట్టుకున్నట్టు ఎస్సై కందూరి రాజు తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం. సోమవారం హత్తినిలోని తాళ్లపల్లి మనోజ్ రావు ఇంట్లో బండి సింహాద్రి అనే వ్యక్తి 124 కిలోల గ్లైసిల్ పత్తి విత్తనాలను ట్రాక్టర్లో లోడ్ చేస్తుండగా పట్టుకున్నామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి, విత్తనాలు సీజ్ చేసినట్టు తెలిపారు. వాటి విలువ రూ. 3, 10, 000 ఉంటుందని ఎస్ఐ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :