కాగజ్‌నగర్ మండలంలోని నాగంపేట రేషన్ షాప్ నెం: 2405021ను ఆదివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు శ్రీనివాస్, రాజ్ కుమార్ తనిఖీ చేశారు. షాపులోని భౌతిక నిల్వలను తనిఖీ చేయగా 10. 75 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని డీలర్ గజ్జి రవిని విచారించగా ఇటుక బట్టి కార్మికులకు బియ్యం అమ్మానని తెలిపారు. దీంతో షాపును సీజ్ చేసి సదరు డీలర్ పై కేసు నమోదు చేశారు.