బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన గుమ్ముల శ్రీనివాస్ ఇల్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో ఫ్రిడ్జ్ నుండి మంటలు చెలరేగడంతో మూడు రూముల్లోని సామాగ్రి మొత్తం కాలిపోవడం జరిగింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులకు రూ. 10, 000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టిపిసిసి మెంబర్ అర్షద్ హుస్సేన్, రాచకొండ శ్రీవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.