కౌటాల మండలంలోని ఎంఈఓ మండల విద్యా వనరుల కేంద్రం కార్యాలయంలో ఎంఈఓ అధికారి విధులకు ఎప్పుడు హాజరు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియడం లేదని ఎంఈఓ సమయపాలన పాటించడం లేదని మండల ప్రజలు ఆరోపించారు. బుధవారం పనుల నిమిత్తం వచ్చిన మండల ప్రజలకు మధ్యాహ్నం పన్నెండు గంటలైన అధికారి కాలి కుర్చీ దర్శనం ఇవ్వడంతో సార్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని ధోరణి చోటుచేసుకుంటోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.