సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుని వారి నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవ సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలియజేసినారు. సంఘ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకరణ మహోత్సవం అక్టోబర్ 8న సంతోష్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావలసిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది.