పెంచికల్పేట్ మండలం మేరగూడ గ్రామంలో వెలసిన పురాతనమైన గొంతెమ్మ ఆలయంలో సోమవారం జరిగిన బోనాల పండుగలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. బీజేపి జిల్లా అధ్యక్షులు డా కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బండి రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.