"ఈ అవ్వను ఆదుకోండి" శీర్షికన మన లోకల్ ఆప్ లో వచ్చిన వార్తకు కాగజ్‌నగర్ టౌన్లో పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న కిరణ్ స్పందించారు. శనివారం వివేకానంద యూత్ యువకులతో కలిసి ఆయన తిరందాజ్ బస్తికి చేరుకుని ముసలవ్వను(కాటం లక్ష్మి) స్తానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. త్వరగా కోలుకునేలా చూడాలని డాక్టర్ ను కోరారు. యువకులు వంశి, అనిల్, స్వామి, వేంకటేశ్, సునిల్, కిరణ్, అహ్మద్, తాజ్ బాబా పాల్గొన్నారు.