ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
తిర్యాణి మండలం బోడగూడ గ్రామంలోని అటవీ ప్రాంతంలో మేకల కాపరి పంద్రం బగ్గు శనివారం సాయంత్రం మేకలను మేపి ఇంటికి వెళ్తుండగా పిల్లలతో కూడిన ఎలుగు బంటి ఒక్కసారిగా దాడి చేసింది. ఆ దాడిలో బగ్గు కాలికి తీవ్ర గాయం కావడంతో స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.