తిర్యాణి మండలంలోని 1014 మంది రైతులకు 5, 96,21, 739 రూపాయల రుణమాఫీ కావడంతో గురువారం తిర్యాని డిసిసిబి చైర్మన్ చుంచు శ్రీనివాస్ మండల రైతుల తరపున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో డక్కన్ గ్రామీణ బ్యాంకులో 817 మందికి రుణమాఫీ కాగా, జిల్లా సహకార బ్యాంకులో 197 మందికి రుణమాఫీ అయినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.