జనసేన పార్టీ ములకలపల్లి మండల కమిటీ నియామకం

2103చూసినవారు
జనసేన పార్టీ ములకలపల్లి మండల కమిటీ నియామకం
జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రామ్ తాళ్ళూరి ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గంలో మండల స్థాయి కమిటీలు నియమించడం జరిగింది. దీనిలో భాగంగా ములకలపల్లి మండల కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ ములకలపల్లి మండల అధ్యక్షులుగా తాటికొండ ప్రవీణ్ గారు, ఉపాధ్యక్షులుగా పొడిచేటి చెన్నారావు గారు, ప్రధాన కార్యదర్శిగా ఊకే నాగరాజు గారు, కార్యనిర్వాహణ కార్యదర్శిగా చామర్తి సుధాకర్, సహాయ కార్యదర్శిగా బొక్క వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా మేక నరసింహారావు, కార్యదర్శిగా బాదావత్ రవి కుమార్ వీరిని మండల కమిటీగా నియమించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులుగా నియమితులైన తాటికొండ ప్రవీణ్ గారు మాట్లాడుతూ ములకలపల్లి మండలంలో జనసేన పార్టీ విధివిధానాలను, అధ్యక్షుల వారి ఆశయాలను కొనసాగిస్తూ పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కష్టపడతాం అని అలాగే గ్రామ గ్రామాన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం సెక్రెటరీ గరికే రాంబాబు, ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కార్య నిర్వాహక సభ్యులు గొల్ల వీరభద్రం, కోడిమే వంశీ మరియు ముఖ్య నాయకులు కందుకూరి వినీత్, మరియు వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్