ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు సూచించారు. అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులను పరిశీలించి వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనితీరును మెరుగు పరచుకుని ఆసుపత్రికి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న ఓపీ, నూతన వసతులతో నిర్మిస్తున్న మార్చురీ భవన పనులను పరిశీలించారు.