ములకలపల్లి మండల కేంద్రమైన రామాంజనేయపురం నుంచి మంగపేట వెళ్లే సమీపాన జింక పిల్లను బాలాజీ దుర్గరావు గమనించి కాపాడారు. ఈ మేరకు వారు జింక పిల్లను స్థానిక ఫారెస్ట్ DRO రాము కు మంగళవారం అప్పగించారు. ఆపదలో ఉన్న వన్య ప్రాణులను ప్రతి ఒక్కరు బాధ్యతగా కాపాడాలని సూచించారు. జింక పిల్లను అప్పగించిన బాలాజీ దుర్గరావు ను ఆయన అభినందించారు.