అశ్వారావుపేట: అచ్చం అల్లు అర్జున్ గెటప్‌లో అభిమాని సందడి

78చూసినవారు
అశ్వారావుపేట: అచ్చం అల్లు అర్జున్ గెటప్‌లో అభిమాని సందడి
పుష్ప -2 మూవీలో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదల సందర్భంగా అశ్వారావుపేట మండలం లక్ష్మీ శ్రీనివాస థియేటర్‌ లో బుధవారం అల్లు అర్జున్ అభిమాని అమ్మవారి గెటప్ వేసి సందడి చేశాడు. థియేటర్ వద్ద ఉన్న బన్నీ ఫ్యాన్స్‌ను ఆ గెటప్ ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో థియేటర వద్ద అల్లు అర్జున్ అభిమానులతో సందడి నెలకొంది. అభిమానులు టపాసులు కాల్చి, స్వీట్లు తినిపించుకుంటూ సందడి చేశారు.

సంబంధిత పోస్ట్