విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేదిలేదని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్ స్పష్టం చేశారు. శనివారం చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని, సంబంధిత రికార్డులను సైతం ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ. ఐదేళ్లలోపు పిల్లలకు తప్పకుండా వ్యాధినిరోధక టీకాలు వేయించాలన్నారు. ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటించాలన్నారు.