భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో ఆదివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు గ్రామాలలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సర్వే విధానాన్ని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిశీలించారు. అలాగే కొన్నిచోట్ల సర్వే వల్ల నష్టం జరుగుతుందని వస్తున్న పుకార్లను నమ్మవద్దని కేవలం అవగాహన లేని వాళ్ళు అలా సృష్టిస్తున్నారని అన్నారు.