ములకలపల్లిలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ఆదినారాయణ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశానికి ప్రాణాలర్పించిన మహానుభావుల సేవలను విద్యార్థులకు ఎమ్మెల్యే వివరించారు. స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ముందుకు సాగాలని పేర్కొన్నారు.