వీఆర్ఏల సమ్మెకు మద్దతు పలికిన జనసేన పార్టీ

1228చూసినవారు
వీఆర్ఏల సమ్మెకు మద్దతు పలికిన జనసేన పార్టీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో తాసిల్దార్ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా వీఆర్ఏలు నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. వీఆర్ఏలకు జనసేన పార్టీ మద్దతు తెలపడం జరిగింది. ములకలపల్లి మండల జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం నాయకులు మరియు మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది వీఆర్ఏ ఉద్యోగులు ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పే స్కేల్ 55 సంవత్సరాలు పైబడిన వారి కుటుంబ సభ్యుల లో ఒకరికి ఉద్యోగావకాశం, 2017 ఫిబ్రవరి 20వ తేదీ, ప్రగతి భవన్ లో ఇచ్చిన హామీ సెప్టెంబర్ 9/ 2020 అసెంబ్లీ లో ఇచ్చిన హామీలతో పాటు మార్చి 22 మరోసారి ఇచ్చిన హామీ యొక్క జీవోలను వెంటనే విడుదల చేయాలని ప్రవీణ్ గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, సకల జనుల సమ్మెలో వీఆర్ఏల పాత్ర ఎంతో ఉందని వారి చట్టబద్ధమైన సమస్యలను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు వారి సమస్యలు పరిష్కరించని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ వారి పోరాటానికి అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కార్యనిర్వాహక సభ్యులు గొల్ల వీరభద్రం, కోడిమే వంశీ, మండల ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు, సహాయ కార్యదర్శులు బొక్క వెంకటేశ్వర్లు, బాదావత్ రవికుమార్, ముఖ్య నాయకులు కందుకూరి వినీత్ కార్యకర్తలు నక్క న రమేష్, బోలగాని పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్