ములకలపల్లిలో జనసేన జెండా ఆవిష్కరణ

2500చూసినవారు
ములకలపల్లిలో జనసేన జెండా ఆవిష్కరణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో జనసేన పార్టీ దిమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జనసేన పార్టీ దిమ్మను పార్టీ జెండాను ముఖ్య అతిథిగా విచ్చేసిన కొణిదల నాగబాబు ఎగరవేయవలసి ఉండగా కొన్ని అనివార్య కార్యాల వలన రాలేకపోయారు. కొణిదల నాగబాబు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రాం తాలూరి ఆదేశాల ప్రకారం అశ్వరావుపేట నియోజకవర్గ ముఖ్య నాయకులైనటువంటి యార్లగడ్డ శ్రీనుని జగన్నాధపురం నుంచి ములకలపల్లి మండల కేంద్రం వద్దకు ర్యాలీగా తీసుకురావడం జరిగింది. యార్లగడ్డ శీను ములకలపల్లి వచ్చి జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి మరియు యువజన మరియు మండల నాయకులు మాట్లాడుతూ.. ఈ జెండా ఆవిష్కరణ కొరకు గత మూడు రోజులుగా మండలంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు అందరూ కూడా నిస్వార్ధంగా పనిచేశారని, పార్టీ కోసం కార్యకర్తలు అహర్నిశలు కష్టపడుతున్నారని, ఇదేవిధంగా మండలంలో జనసేన కార్యకర్తలు పనిచేస్తూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఈ జండా ఆవిష్కరణ కార్యక్రమంలో తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్