భద్రాచలంలో కనులపండువగా రామయ్య తెప్పోత్సవం

52చూసినవారు
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారికి తెప్పోత్సవ కార్యక్రమాన్ని గోదావరి నదిలో వైభవంగా నిర్వహించారు. 6 గంటల నుంచి భద్రాద్రి రామయ్యకు గోదావరిలో హంసాలంకృత తెప్పపై జల విహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదిలా ఉండగా, రేపు ఉదయం ఉత్తర ద్వారం నుంచి లక్ష్మణ సమేత సీతారాములు దర్శనం ఇవ్వనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్