భద్రాచలం లక్ష్మీనగరం ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాల బాలిక ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పీడీఎస్ఈయూ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగెల శివ ప్రశాంత్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసు పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆదివారం ఆయన పరామర్శించారు. ఆర్సీఓ సైతం ఏజెన్సీలో విద్యార్థులపై శ్రద్ధ చూపడంలేదని ఆరోపించారు.