దుమ్ముగూడెం: టేకుకలప పట్టివేత

58చూసినవారు
దుమ్ముగూడెం: టేకుకలప పట్టివేత
దుమ్ముగూడెం మండల పరిధి పర్ణశాల సెక్షన్లోని అక్రమ టేకుకలపను అటవీశాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. కొందరు స్మగ్లర్లు టేకు దిమ్మెలకు తాడుకట్టి గుబ్బలమంగి వాగులో అక్రమంగా దాచిపెట్టారు. సమాచారం అందుకున్న ఫారెస్టు రేంజి అధికారి కమల తన సిబ్బందితో వెళ్లి తనిఖీలు నిర్వహించారు. వాగులో దాచిన 9 టేకు దిమ్మెలను బయటకు తీసి స్వాధీనం చేసుకొని ట్రాక్టర్లో భద్రాచలం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.

సంబంధిత పోస్ట్