భద్రాచలం శ్రీనృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో వ్యాస పౌర్ణమిని పురస్కరించుకొని గోవింద కల్పవృక్ష నారసింహశాలగ్రామ ఆశ్రమంలో ఆదివారం గురుపూజోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. నృసింహ సేవా వాహిని సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో శిష్యులు సత్కరించారు. మన్యంలో ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతగా హరిజన, గిరిజన పల్లెల్లో. గురుదేవులుగా తలచే స్వామికి పాదపూజలు చేసి పరవశించిపోయారు.