రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద నీటిమట్టం

84చూసినవారు
రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద నీటిమట్టం
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా
ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి క్రమంగా పెరుగుతూ సాయంత్రానికి 43 అడుగులకు చేరుకుంది. దీంతో కలెక్టర్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అనంతరం రాత్రి 9 గంటలకు 44 అడుగులు, రాత్రి 12 గంటలకు 45. 01 అడుగులుగా నమోదైంది. సోమవారం ఉదయం 6 గంటలకు 46. 5 అడుగులకు చేరింది. మరో అడుగున్నర వస్తే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్