ఇల్లందు: స్కాలర్షిప్ విడుదల చేయాలని ఎమ్మెల్యేకు వినతి

79చూసినవారు
ఇల్లందు: స్కాలర్షిప్ విడుదల చేయాలని ఎమ్మెల్యేకు వినతి
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఎ జిల్లా కో-కన్వీనర్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ, విద్యార్థులకు స్కాలర్షిప్లు రాకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నాయన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్