భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 78వ స్వాతంత్ర వేడుకలను ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.