దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం గ్రామంలో గల ద్వాదశజ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలంలో జూలై 17 నుంచి వేద పాఠశాలను ప్రారంభిస్తున్నామని ఆలయ వ్యవస్థాపకుడు శివనాగస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పాఠశాలలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తామని, ఉచిత విద్య, భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. వేద పాఠశాలలో అడ్మిషన్లు కావాలనుకునే వారు 9908229103 నంబర్లో సంప్రదించాలన్నారు.