భార్య కేసు పెట్టిందని ఓ వ్యక్తి పురుగుల మందు తాగి చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. దుమ్ముగూడెం మండల పరిధిలోని కాశీనగరం గ్రామానికి చెందిన ఎబినేజర్ (40) తన భార్య సలోమీపై చేయిచేసుకున్నాడు. ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. మనస్తాపంలో ఎబినేజర్ పురుగుమందు తాగాడు. బంధువులు 108లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై కేశవరావు కేసు నమోదు చేశారు.