మహిళా చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్సై

66చూసినవారు
మహిళా చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్సై
మహిళల కోసం ఏర్పడ్డ చట్టాలను అధ్యయనం చేసి సద్వినియోగం చేసుకోవాలని పట్టణ ఎస్సై విజయలక్ష్మి కోరారు. భద్రాచలం పట్టణంలో గురువారం ఐద్వా ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని ఎస్ఐ ప్రారంభించారు. మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖలో అనేక విభాగాలను ఏర్పాటు చేయడం జరిగిందని షీ టీమ్‌లతో పాటు సఖీ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్నిట్లో సమానంగా నిలుస్తున్నారని, అదే ఈ దేశ అభివృద్ధికి మూలమని అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్