బూర్గంపాడు: ఒక్క రోజులో మూడు సాధారణ కాన్పులు
బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లి బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎం. లక్ష్మీ సాహితి ఆధ్వర్యంలో శనివారం ఒక్క రోజులో మూడు సాధారణ కాన్పులు జరిగాయి. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యురాలు లక్ష్మీ సాహితి తెలిపారు. వారికి పుట్టిన వెంటనే వేయాల్సిన టీకాలు వేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పొందాల్సి అన్ని సదుపాయాలతో పాటు అన్ని సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు.