పురుగుల మందు తాగి బాలిక ఆత్మహత్య
గుండాలలో హాస్టల్ కు వెళ్లడం ఇష్టం లేక బాలిక పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తోలెం నిహారిక (12) స్థానిక కస్తూర్బా విద్యాలయంలో 8వ తరగతి చదువుతోంది. శనివారం ఇంటికి రాగా సోమవారం హాస్టల్ కి వెళ్లాలని తల్లిదండ్రులు సూచించారు. హాస్టల్ కి వెళ్లడం ఇష్టం లేక మంగళవారం పురుగులమందు తాగడంతో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు.