భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం లో భగత్ సింగ్ నగర్ కు చెందిన తాళ్ల శ్రీను పెయింటింగ్ వర్క్ చేస్తున్న సమయంలో బిల్డింగ్ పైనుంచి జారి పడడంతో ఎడమ చేయి విరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా మరియు మండల నాయకులు తాళ్ల శ్రీను పరామర్శించారు. తాళ్ల శ్రీను కు సర్జరీ కోసం సుమారు లక్ష రూపాయల ఖర్చు అయినట్లు తెలిపారు. ఈ క్రమంలో మండలంలో ఉన్న జిల్లా మరియు మండల నాయకులు కార్యకర్తల సహకారంతో మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో గురువారం నిత్యవసరాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు గొల్ల వీరభద్రo, గరిక రాంబాబు, తాటికొండ ప్రవీణ్, సాయి, అలుగుల శ్రావణ్, బొక్క వెంకటేశ్వర్లు, మోటా సుధాకర్, డాక్టర్ రఫీ పాషా తదితరులు పాల్గొన్నారు.