పర్యావరణానికి హాని కలగని మట్టి ప్రతిమలతో వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పిలుపునిచ్చారు. మట్టి ప్రతిమలపై కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడ పత్రికను బుధవారం ఆయన ఆవిష్కరించారు. రసాయనాలతో తయారు చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో నీటి వనరులు కలుషితం అవుతాయని కలెక్టర్ అన్నారు. పీసీబీ ఈఈ బి. రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.