భారీ వర్షాల నేపథ్యంలో కిన్నెరసాని నదికి భారీగా వరదనీరు చేరుతుండడంతో స్థానిక ప్రజలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అప్రమత్తం చేస్తున్నారు. కిన్నరసాని దిగువ గ్రామాల మధ్య నూతనంగా నిర్మితమవుతున్న బ్రిడ్జి వద్ద కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించి, అధికారులకు అప్రమత్తంగా ఉండాలని బుధవారం ఆదేశించారు. కిన్నెరసాని రిజర్వాయర్ గేట్లను తెరిచిన సమయంలో పర్యాటకులను ఎవ్వరినీ అనుమతించవద్దని డ్యామ్ అధికారులకు సూచించారు.