కొత్తగూడెం హేమచంద్రపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసు అధికారులతో మల్టీ జోన్-1 ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా సమావేశానికి విచ్చేసిన ఐజిపీకి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసుల పనితీరును, నిషేధిత మావోయిస్టుల కదలికల పట్ల ప్రస్తుత స్థితిగతులను ఎస్పీ వివరించారు.