అశ్వరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న బెల్టు షాపులను తిషేయాలని అశ్వరావుపేటలో ఎక్సేంజ్ కార్యక్రమంలో శనివారం వినతిపత్రం అందజేశారు. మద్యం బెల్ట్ షాపులు 24 గంటలు అందుబాటులో ఉంటున్నాయి అని అలా ఉండటం వల్ల చాలా మంది యువత పూర్తిగా మత్తుకు బానిస అవుతున్నారని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మద్యం నియంత్రణ లేకపోవడం వల్ల యువత రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.