Feb 25, 2025, 11:02 IST/
డిగ్రీ పరీక్షా ఫీజు గడువు పొడగింపు
Feb 25, 2025, 11:02 IST
తెలంగాణలోని డిగ్రీ విద్యార్థులకు ఓయూ ఊరటనిచ్చింది. ఓయూ పరిధిలోని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువును ఈ నెల 28వ తేదీ వరకు పొడగించినట్లు తెలిపింది. నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షా ఫీజు గడువును పెంచింది. రూ.500 అపరాధ రుసుముతో వచ్చే నెల 4వ తేదీ వరకు చెల్లించవచ్చు. కాగా, పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఓయూ స్పష్టం చేసింది.