పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

375చూసినవారు
పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద శనివారం 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, సీతంపేట ఉపసర్పంచ్ కొండేరు నాగభూషణం, సొసైటీ డైరెక్టర్ కొండేరు రాము, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు దాట్ల వాసుబాబు, యాంపాటీ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్