భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకుగూడెం మండలం అనంతారం పంచాయితీ కొత్తూరు గ్రామానికి చెందిన ఇర్ప సాకేత్ (17) అనే యువకుడు మృతి చెందాడు. పద్మాపురం పంచాయితీ మొగిలితోగు గ్రామ సమీపంలోని గురువారం ఒక రైతుకు చెందిన మోటర్ పనుల నిమిత్తం పనులకు వచ్చిన సాకేత్ కు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో యువకుడిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే సాకేత్ మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.