గ్రామాల అభివృద్ధికి కట్టుబడి కృషి చేస్తున్నట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. అశ్వాపురం మండలం పలు గ్రామాల్లో రూ. 12. 5 లక్షలతో నిర్మించిన పలు సిమెంట్ రహదారులను శనివారం ఆయన ప్రారంభించారు. నియోజకవర్గానికి 4, 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయన్నారు. వీటిని అర్హులైన నిరు పేదలకే అందజేస్తామన్నారు.