మణుగూరు మండలం ముత్యాలమ్మ నగర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన అతని కుమార్తె శాంతి అంగవైకల్యంతో మంచంలో నుంచి లేవలేని దిన పరిస్థితిలో కనీసం మందులు కొనడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శుక్రవారం మైస ఎల్లయ్య కుటుంబ సభ్యులకు 5000 రూపాయలు ఆర్థిక సాహయం అందజేశారు.