భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సివిల్ వన్ సిఎస్పి రోడ్డు నందు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యప్ప స్వామి మాల ధరించి 41 రోజులు స్వాత్వికాహారం తీసుకుంటూ, ఏకభుక్తా భోజనం చేస్తూ కఠిననియమాలను పాటించి, దీక్ష కాలం పూర్తి చేసిన స్వాములకు మంగళవారం సామూహికంగా ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు.