మణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయతీ ఎన్టీఆర్ నగర్ ద్వారక వీధిలో నూతనంగా నిర్మించిన స్వాగత ఆర్ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే స్థానిక ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.