ప్రస్తుత సమాజంలో కచ్చితంగా జరగాల్సిన కుల వ్యవస్థ నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని మణుగూరు బీటీపీఎస్ సీఈ బిచ్చన్న అన్నారు. మణుగూరులోని బీటీపీఎస్లో కొనసాగుతున్న నిఘా అవగాహన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్లాంటు వద్ద ర్యాలీ నిర్వహించారు. విజిలెన్స్ డీఎస్పీ నరేష్, ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ తిరుపతి, సివిల్ ఎస్ఈ రమణమూర్తి, ఎస్ఈలు రమేష్, పార్వతి, శ్రీనివాసరావు, డీఈలు పాల్గొన్నారు.