మణుగూరు ఎండీవో కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఇందిరమ్మ మోడల్ హౌస్కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిన విధంగా నిరుపేదలకు ఇళ్లు అందించడం జరుగుతుందన్నారు. ఆ సంకల్పంతోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ పథకంలో రూ. 5లక్షల వరకు సాయం అందుతుందని గుర్తు చేశారు.