దేశ సుభిక్షానికి మోదీ పాలన అవసరం: సీతారాంనాయక్

51చూసినవారు
దేశ సుభిక్షానికి మోదీ పాలన అవసరం: సీతారాంనాయక్
దేశ సుభిక్షానికి మోదీ పాలన మళ్లీ అవసరమని మహబూబాబాద్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి సీతారాంనాయక్ తెలిపారు. మణుగూరు, అశ్వాపురంలో శుక్రవారం ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే లోక్సభ స్థానం పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, భారాస వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. మహబూబాబాద్ లోక్ సభ స్థానం భాజపా కన్వీనర్ ముస్కు శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్