పినపాక మండలం పోట్లపల్లి గ్రామ యువత ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి వాలీ బాల్ పోటీలు గురువారం ఫైనలక్కు చేరుకున్నాయి. అశ్వారావుపేట మండలం ఆసుపాక, పోట్లపల్లి జట్ల మధ్య చివరి పోరు రసవత్తరంగా సాగింది. అసాంతం విజయం దిశగా సాగిన ఆసుపాక జట్టు విజేతగా నిలిచింది. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మండల నాయకులు కల్యాణి, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.