మణుగూరు అభివృద్ధిలో సింగరేణి పాత్ర కీలకం

64చూసినవారు
మణుగూరు అభివృద్ధిలో సింగరేణి పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. జీఎం కార్యాలయంలో సింగరేణి సీఎస్సార్ నిధులతో మంజూరైన ఫర్నీచర్ను ప్రభుత్వ పాఠశాలకు శుక్రవారం అందజేశారు. సింగరేణి ఏర్పడక ముందు మణుగూరులో పదుల సంఖ్యలో నివాస గృహాలు ఉండేవని, నేడు నివాసాల సంఖ్య వేలకు చేరిందన్నారు. సింగరేణి గనులు ఉండటం వల్లనే భారజల, బీటీపీఎస్, ఐటీసీ తదితర కర్మాగారాలు ఏర్పడ్డాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్