కోల్ ఇండియా, ప్రైవేటు కంపెనీల నుంచి ఎదురయ్యే గట్టి పోటీని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొత్త బొగ్గు బ్లాకులను పొందేందుకు కృషి చేస్తున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. మణుగూరు ఏరియాలో శుక్రవారం సీఎండీ పర్యటించారు. ఓసీ, ఓసీ-2లో సీఎండీ కార్మికులతో కలిసి అల్పాహారం చేశారు.