ఇటీవల వరదల కారణంగా ముంపుకు గురై తడిసి ముద్దెన చౌకదుకాణం పిడిఎస్ బియ్యాన్ని బుధవారం మణుగూరు సివిల్ సప్లయ్ డిటి శివకుమార్ పరిశీలించారు. పలు ప్రాంతంలోని రెండు రేషన్ దుకాణాల్లో లబ్దిదారులకు పంపిణీ చేయాల్సిన బియ్యం వరదల కారణంగా ముంపుకు గురై దుర్వాసన వెదజల్లుతున్నాయి. రేషన్ షాప్ డీలర్లు తహశీల్దార్ రాఘవరెడ్డికి, సివిల్ సప్లయ్ డిటికి సమాచారం అందించగా వారు రేషన్ షాపులను సందర్శించి బియ్యాన్ని పరిశీలించారు.